: ములాయం, అఖిలేష్, మాయావతిలకు షాక్ ఇచ్చిన యోగి


ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం, అఖిలేష్, మాయావతిలకు భద్రతను తగ్గిస్తూ సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు ములాయం కుటుంబసభ్యులు డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ లకు కూడా భద్రతను తగ్గించారు. బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ తో పాటు మరికొందరికి భద్రతను పెంచారు. కటియార్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. నిన్న రాత్రి హోంశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం యూపీలో 151 మంది వీఐపీలు భారీ భద్రత పొందుతున్నారు. వీరిలో 46 మందికి భద్రతను తగ్గించారు యోగి. మిగిలిన 105 మందికి పూర్తిగా భద్రతను తొలగించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, భద్రతను కలిగి ఉండటం సామాజిక హోదాగా భావిస్తున్నారని... వీరికి భద్రతను కల్పిస్తున్న సిబ్బందిని సామాన్యుల రక్షణ కోసం వినియోగించాలని అన్నారు.

  • Loading...

More Telugu News