: ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన శాస్త్రవేత్తలు.. 500 నగరాల్లో ప్రదర్శనలు


నిత్యం పరిశోధనల్లో మునిగి తేలే శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డుకెక్కారు. పరిశోధనలపై చిన్నచూపు చూస్తుండడం, సైన్స్‌కు ఇచ్చే నిధుల్లో కోత పెట్టడం, పరిశోధనకారులపై పెత్తనం, రాజకీయాలను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 500 నగరాల్లో శాస్త్రవేత్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తమకు మరింత స్వేచ్ఛ, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక పరిశోధన రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రంగంలో తీసుకునే నిర్ణయాల్లో శాస్త్రవేత్తలకు ట్రంప్ భాగస్వామ్యం కల్పించడం లేదు.

అలాగే పరిశోధనకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టడం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక వైట్‌హౌస్ వెబ్‌సైట్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను తొలగించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా వాతావరణ మార్పులపై చేసిన ప్రసంగాలను కూడా తొలగించారు. దీనిని వ్యతిరేకిస్తూ టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్‌లోని పరిశోధకుడు జొనాథన్ బెర్మన్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది శాస్త్రవేత్తలు మార్చ్ నిర్వహించారు.  వాషింగ్టన్‌, లండన్‌, జెనీవా, బెర్లిన్ సహా వివిధ  నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి.

  • Loading...

More Telugu News