: పవన్‌ జనసేన పార్టీ మూడు గంటల సినిమా లాంటిదే: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు


సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ మూడు గంటల సినిమా లాంటిదని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఈ రోజు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... పవన్ సినిమాలు మూడు గంటల పాటు చూడడానికి బాగా ఉంటాయ‌ని, అలాగే ఆయన జనసేన పార్టీ కూడా అంతేన‌ని చుర‌క‌లు అంటించారు. ఆ పార్టీ ఎంతోకాలం నిలవదని విమ‌ర్శించారు. అలాగే ఏపీలో జ‌రుగుతున్న పార్టీ ఫిరాయింపుల‌పై కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.

  • Loading...

More Telugu News