: నల్గొండ జిల్లాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడుతున్నారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రాకూడదని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..
ఖమ్మం- 44 డిగ్రీలు
రామగుండం -43.2 డిగ్రీలు
నిజామాబాద్- 42.8 డిగ్రీలు
ఆదిలాబాద్ -42.7 డిగ్రీలు
భద్రాచలం- 42.2 డిగ్రీలు
మహబూబ్ నగర్ -41.9
మెదక్- 41.6 డిగ్రీలు
హైదరాబాద్- 41.2 డిగ్రీలు