: బిస్కెట్లు కొనడానికి వెళ్లాను.. నలుగురు వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు: అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసిన అమ్మాయి


ఇంటికి వెళ్లడం ఆలస్యమైపోయింది.. ఇంటికి వెళ్ల‌గానే అమ్మానాన్న తిడ‌తారేమో? ఇప్పుడెలా? అని టెన్ష‌న్ ప‌డ్డ 17 ఏళ్ల అమ్మాయి ఏకంగా ఓ క‌థ‌నే అల్లేసి, త‌ల్లిదండ్రుల‌ను ఆందోళ‌న‌కు గురించేసింది. బెంగళూరుకి చెందిన ఓ యువతి ఓ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులకు హాజరవుతూ శిక్ష‌ణ తీసుకుంటోంది. అయితే, ఏం జ‌రిగిందో ఏమో... సాయంత్రం ఇంటికి లేటుగా వ‌చ్చింది. ఎందుకు ఆల‌స్య‌మైంద‌ని ఆమె తల్లిదండ్రులు అడ‌గ‌గానే తాను కిడ్నాప్ అయినట్లు చెప్పింది. తాను క్లాస్ అయిపోగానే బిస్కెట్లు కొందామని ఓ షాపు వద్దకు వెళ్లాన‌ని, అదే స‌మ‌యంలో ఒక్క‌సారిగా అక్క‌డ‌కు ప్ర‌వేశించిన న‌లుగురు దుండ‌గులు త‌న‌ని బ‌ల‌వంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లార‌ని చెప్పింది.

తన మెడ, చేతులపై వారు గాయాలు చేశార‌ని, అనంత‌రం ఒక సిగరెట్‌తో కాల్చేందుకు కూడా ప్ర‌యత్నించారని తెలిపింది. వారంతా హిందీ, తమిళ భాషల్లో మాట్లాడుకుంటున్నార‌ని తెలిపింది. కొంత స‌మ‌యం గ‌డ‌వ‌గానే త‌న‌ను తీసుకెళుతున్న ఆ కారుకి రిపేర్ అయింద‌ని, నలుగురు వ్యక్తులు కిందకు దిగార‌ని, అదే స‌మ‌యంలో తాను ధైర్యం చేసి కారు నుంచి దూకేసి తప్పించుకుని పారిపోయి వ‌చ్చేశాన‌ని తెలిపింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా అస‌లు ఆ యువతి కిడ్నాప్ కాలేదని విచారణలో తేలింది. ఆమె అన్నీ అబద్ధాలు చెబుతోంద‌ని తేల్చి చెప్పారు. కిడ్నాప్ అయినట్లు చెబుతున్న ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేయ‌గా ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని బెంగ‌ళూరు పొలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News