: డివైడర్‌ను ఢీకొట్టి వంతెనపై నుంచి కిందపడిపోయిన కారు... ముగ్గురి మృతి
గుంటూరు జిల్లా కాకానిలో ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతం గుండా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పడంతో అక్కడి డివైడర్‌ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతులు బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా గుర్తించారు. వారంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ వివాహానికి హాజరై, తిరిగి బెంగళూరు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. ఆ కారు వేగంగా బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయిందని వివరించారు.