: బాహుబలి-2 వీడియో సాంగ్ ప్రోమో విడుదల.. ప్రభాస్‌లో ఉట్టిపడుతున్న రాజసం!
బాహుబలి-2 వీడియో సాంగ్ ప్రోమోను ఈ రోజు లహరి మ్యూజిక్, టీ సిరీస్ సంయుక్తంగా విడుదల చేశాయి. ఈ వీడియోలో బాహుబలి ప్రభాస్‌లో రాజసం ఉట్టిపడుతోంది. బాహుబలి మాహిష్మతీ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించగా, అదే సమయంలో వేలాది మంది ప్రజలు ఆయనకు నీరాజనాలు పడుతూ పూలు చల్లారు. భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ పాటను కొంత వినిపించారు. ఈ వీడియోలో కట్టప్ప, శివగామి కూడా కనిపించారు. ప్రభాస్ కత్తి తిప్పుతోన్న తీరు, యుద్ధకళను ప్రదర్శిస్తోన్న శైలి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాహిష్మతి సామ్రాజ్యంలోని సైన్యం, ఏనుగు తొండానికి అమర్చిన ఓ అతిపెద్ద విల్లు వంటి ప్రత్యేక ఆకర్షణలు అభిమానులను అలరిస్తున్నాయి. యూ ట్యూబ్‌లో ఈ వీడియో దూసుకుపోతోంది.