: హైదరాబాద్ బంజారా హిల్స్ లో పవన్ కల్యాణ్ చేతుల మీదుగా సెలూన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ రోజు ఓ సెలూన్ ప్రారంభమైంది. విక్టరీ వెంకటేశ్‌తో కలిసి 'గోపాల గోపాల' సినిమాలో నటించిన పవన్ కల్యాణ్ కు హెయిర్ స్టైలిస్ట్ గా రామ్ కొనికి పనిచేశారు. ఈ సెలూన్ ని ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు. అధునాతన పరికరాలతో రామ్ కొనికి ఈ సెలూన్‌ను నిర్మించాడు.