: ‘రూ.5 కే భోజనం’ రుచి చూసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్ బేగంపేటలోని అన్నపూర్ణ కేంద్రాన్ని, ప్రారంభించి ఐదు రూపాయలకు అందిస్తోన్న భోజనం తిన్నారు. ఇప్పటికే ఈ సర్వీసులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. వాటి సంఖ్యను ప్రభుత్వం 150కి పెంచింది. రూ.5కే భోజనం తిన్న కేటీఆర్ భోజనం అద్భుతంగా ఉందని అన్నారు. ఈ కేంద్రాల ద్వారా రూ.5 కే భోజనం అందించే పథకం ఎంతో మంది ఆకలి తీర్చుతుందని ఆయన కొనియాడారు. గతంలోనూ ఓ సారి కేటీఆర్ రూ.5 కే అన్నం కొనుక్కొని రుచి చూసిన విషయం తెలిసిందే.