: నా మాటలకి కట్టుబడి ఉన్నాను: తన సంచలన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గని మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి


బాబ్రీ మసీదును కూల్చిన కేసులో భారతీయ జనతా పార్టీ సీనియ‌ర్ నేత, ఎంపీ ఎల్‌కే అద్వానీతో పాటు మురళీ మనోహర్‌ జోషి, ఉమాభార‌తిల‌ను చేర్చాల్సిందేన‌ని సుప్రీంకోర్టు సీబీఐకి కీల‌క ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో బీజేపీ మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి నిన్న ప‌లు సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది తానేనని, త‌న‌ను ఉరి తీయాల‌ని ఆయ‌న అన్నారు. అయితే, తాను చేసిన మాట‌ల‌పై ఆయ‌న వెన‌క్కి‌తగ్గ‌డం లేదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేది లేదని తేల్చి చెప్పారు.

తాను ఈ విష‌యాన్ని తెల‌ప‌డం ప‌ట్ల తనమీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, రామాలయ నిర్మాణం కోసం పాత కట్టడాన్ని కూల్చివేయాలని కరసేవకులను తానే ఆదేశించినట్టు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మాజీ ఎంపీ రామ్‌ విలాస్‌ వేదాంతి ఈ రోజు మ‌రోసారి ఉద్ఘాటించారు. రామాలయ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయ‌న అన్నారు. సుప్రీంకోర్టు ఇటీవల చేసిన తాజా ఆదేశాల నేప‌థ్యంలో వేదాంతి చేస్తోన్న ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా చ‌ర్చ మొద‌ల‌వుతోంది. ఈ కేసులో వేదాంతి పేరు కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News