: రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ ప్లీనరీ పండుగ చేసుకుంటున్నారు: జగ్గారెడ్డి విమర్శలు
తెలంగాణలో ఓ వైపు రైతులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్లీనరీ పేరుతో పండుగ చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రైతులకు కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. మరోవైపు ఇప్పుడు రైతే రాజు అంటూ కేసీఆర్ ఒట్టిమాటలు పలుకుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసమే కేసీఆర్ ఇప్పుడు రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మిర్చి రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర దొరక్క మిర్చిని కాల్చుకుంటుంటే కేసీఆర్‌కు కనబడటం లేదా? అని ఆయన ప్రశ్నించారు.