: హోటల్ లో సర్వీస్ ఛార్జ్ ఇష్టముంటేనే ఇవ్వండి...తప్పనిసరి అంటే కేసు వేయండి: కేంద్రం


హోటల్ లో తిన్న తరువాత బిల్లులో సర్వీస్ ఛార్జ్ అని ఒక ఛార్జ్ కనిపిస్తుంది. అది కాకుండా వెయిటర్ టిప్పు అడుగుతాడు. దీనిపై విమర్శలు రావడంతో కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుం (సర్వీస్‌ చార్జీ) తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. సేవా రుసుమును కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలని ఆయన స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లకు సూచించారు. సేవా రుసుంపై ఈ మేరకు తయారు చేసిన నూతన మార్గదర్శకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. కస్టమర్లకు చేసిన సేవకు ఎంత వసూలు చేయాలన్నది హోటళ్లు, రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదని, వినియోగదారుడి విచక్షణకే వదిలేయాలని ఆయన సూచించారు.

 సేవా రుసుం అనేదేమీ లేదని, దానిని తప్పుగా వేస్తున్నారని, దీనిపై ఓ సలహాపూర్వక నివేదిక సిద్ధం చేశాం, దానిని ప్రధాని కార్యాలయ ఆమోదానికి పంపించనున్నామని ఆయన తెలిపారు. అలా కాకుండా ఎవరైనా సేవారుసుము తప్పని సరి అని అంటే వారిపై వినియోగదారులు కేసు వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పశ్చిమ భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘం (హెచ్‌ఆర్‌డబ్ల్యూఐ) అధ్యక్షుడు దిలీప్‌ దత్వానీ మాట్లాడుతూ, సేవారుసుం హోటళ్లు వేసే హేతుబద్ధమైన ట్యాక్స్‌ అన్నారు. ఇవేం రహస్యమైన చార్జీలుకావని మెనూలో పేర్కొంటామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News