: విజయవాడ హైవేపై భారీగా స్తంభించిన ట్రాఫిక్
విజయవాడ హైవేపై వాహనదారులు నరకం చూస్తున్నారు. కనకదుర్గ వారధిపై ఓ లారీ బ్రేక్ డౌన్ అయింది. దీంతో, 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు, ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేయడంతో... వెళ్లేందుకు మరో మార్గం లేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. లారీని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.