: గంటసేపు కూలి పనులు చేసి రూ.5 లక్షలు సంపాదించిన తెలంగాణ మంత్రి
టీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం తమ పార్టీ కార్యకర్తలు, నేతలంతా కూలీ పనులు చేసి డబ్బులు సంపాదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూలీ పనులు చేసి డబ్బు సంపాదించిన విషయం తెలిసిందే. ఈ రోజు తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి కూడా కూలీ పనులు చేశారు. హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన ఓ వృద్ధ రోగిని వీల్‌చైర్‌పై మొదటి అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకొచ్చారు. అనంతరం మరో రోగిని స్టెచర్‌పై వార్డ్‌కు తరలించారు. మరో ఆర్థోపెడిక్ రోగికి డ్రెస్సింగ్ చేశారు. మొత్తం గంట సేపు ఆయన ఆ ఆసుపత్రిలో పనిచేశారు. దీంతో యశోద ఆసుపత్రి యాజమాన్యం లక్ష్మారెడ్డికి రూ.5 లక్షల చెక్కు అందజేసింది.