: వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసుల దాడి


హైదరాబాదులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంపై ఈరోజు ఏపీ పోలీసులు దాడి చేశారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు హుటాహుటీన సోషల్ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు జరుగుతున్నవే... రేపు కూడా జరుగుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News