: మెదక్ జిల్లా పొలాల్లో వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్


భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు సమాచారం. గాల్లో ఉన్న సమయంలో సమస్య తలెత్తడంతో, విషయాన్ని కంట్రోల్ రూంకు తెలిపిన పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, దీన్ని కిందకు దించారు. ఈ ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు వాయుసేన పైలట్లు ఉండగా, వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఇది జడ్ 923 రకానికి చెందిన హెలికాప్టరని అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ పోలీసులు హెలికాప్టర్ కు రక్షణ కల్పించారు.

  • Loading...

More Telugu News