: రివ్యూ పెద్ద విషయం కాదు...వాటిని నేను పట్టించుకోను: రాజమౌళి


'బాహుబలి-2: ది కన్ క్లూజన్' సినిమా విషయంలో వచ్చే రివ్యూల గురించి తనకు బెంగలేదని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. 'బాహుబలి-2: ది కన్ క్లూజన్' ప్రమోషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రివ్యూ అనేది ఒక మనిషికి సంబంధించిన అభిప్రాయమని అన్నారు. రివ్యూలో ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తారని ఆయన చెప్పారు. అలాంటి రివ్యూలను తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చే రివ్యూలను ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారని, అలాగా తన అభిప్రాయం తనదని ఆయన తెలిపారు. రివ్యూలు తనకు అనుకూలంగా రాసేవారంతా మంచివాళ్లు, తనకు వ్యతిరేకంగా రాసేవారంతా తనకు వ్యతిరేకులని ఆయన ప్రకటించారు. తన సినిమాలకు మొదటి నుంచి వ్యతిరేకంగా రివ్యూ రాసేవారున్నారని...అలాగే తన సినిమాలను పొడుగుతూ రివ్యూ రాసేవారున్నారని ఆయన అన్నారు. ఎవరు ఎలా రాసినా మనం సినిమాను ఎలా తీశామన్నదే ఇంపార్టెంట్ అని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News