: ఢిల్లీలో పాగా వేసేది బీజేపీయే... బల్లగుద్దుతున్న సర్వే సంస్థలు!


రేపు ఢిల్లీలో జరిగే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఖాయమని రెండు సంస్థలు వెల్లడించాయి. మూడు కార్పొరేషన్లనూ బీజేపీ గెలుచుకోనుందని బల్లగుద్ది చెప్పాయి. మొత్తం 272 సీట్లు ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లలో 195 సీట్లు బీజేపీ గెలుస్తుందని, 55 సీట్లలో ఆప్, 15 చోట్ల కాంగ్రెస్, ఇతరులు 7 చోట్ల గెలుస్తారని టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే పేర్కొంది.

ఏబీపీ న్యూస్ కోసం సర్వే నిర్వహించిన సీ ఓటర్ నార్త్ కార్పొరేషన్ లో 104 సీట్లకు గాను 76 చోట్ల, సౌత్ కార్పొరేషన్ లో 104 సీట్లకు గాను 60 సీట్లలో, తూర్పు కార్పొరేషన్ లో 64 సీట్లకు గాను 43 చోట్ల బీజేపీ గెలుస్తుందని చెబుతోంది. ఆప్ కు వరుసగా 13, 21, 11 సీట్లలో మాత్రమే విజయం లభిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రమేనని పేర్కొంది. బీజేపీకి 40 శాతానికి మించిన ఓటింగ్ వాటా లభిస్తుందని ఇరు సంస్థలూ పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News