: కోహ్లీని అధిగమించిన రైనా
ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సురేష్ రైనా మరో ఘనతను సాధించాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీతో తన జట్టును గెలిపించిన రైనా... ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు 153 మ్యాచ్ లు ఆడిన రైనా... మొత్తం 4,341 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 4,264 పరుగులు చేసిన కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (3,923), నాలుగో స్థానంలో కోల్ కతా నైైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (3,863)లు ఉన్నారు.