: 9 ఏళ్ల బాలిక సహా ఓ కుటుంబంపై గో సంరక్షుల దాష్టీకం!
చిన్న బాలిక అని కూడా చూడకుండా గో సంరక్షకులు దారుణంగా ప్రవర్తించారు. జమ్మూ కాశ్మీర్ లోని రేశాయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆవు మాంసాన్ని తీసుకువెళుతున్నారన్న ఆరోపణలతో తల్వారా ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి చేసిన గో సంరక్షకులు వారిని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో 9 సంవత్సరాల బాలిక సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమ వద్ద ఉన్న గొర్రెలు, మేకలు, ఆవులను వారు బలవంతంగా తీసుకువెళ్లారని, తమను దారుణంగా హింసించారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిలో కొందరిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నట్టు వెల్లడించారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్ లో ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది.