: గెలుపెవరిది?... బాహుబలిదా? ఐపీఎల్ దా?


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్రం ఈ నెల 28న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అన్ని రకాల ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా... బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు రెడీ అయింది. అయితే, ఈ సినిమాపై ఐపీఎల్ ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్-10 సీజన్ ఇప్పటికే కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రేమికులంతా ఐపీఎల్ లో మునిగి తేలుతున్నారు.

ఈ మ్యాచ్ లకు టీఆర్పీ రేటింగ్ లు సైతం భారీగా ఉన్నాయి. 'బాహుబలి-2' సినిమా విడుదల సమయానికి కీలక మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్ ల ఎఫెక్ట్ బాహుబలి కలెక్షన్స్ పై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, మ్యాచ్ లు సాయంత్ర వేళల్లో జరగనుండటంతో... పగటి పూట షోలపై ఎలాంటి ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ ను బాహుబలి ఎంతవరకు ఎదుర్కోగలడో? అంతిమ విజేత ఎవరో? వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News