: డీజే (దువ్వాడ జగన్నాథమ్) చిత్ర యూనిట్ చెప్పిన సర్ ప్రైజ్ ఇదే!
డీజే...దువ్వాడ జగన్నాథమ్ గా మీ ముందుకు జూన్ 23న వస్తున్నానని టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలిపాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ పేజ్ లో దువ్వాడ జగన్నాథమ్ లోని ఒక స్టిల్ ను షేర్ చేసుకున్న అల్లు అర్జున్ దానిపైనే డేట్ ప్రకటించాడు. నిన్న డీజే యూనిట్ 'రేపు ఒక సర్ ప్రైజ్ విషయం చెబుతా'మంటూ ప్రకటన చేసి ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేటి ఉదయం అల్లు అర్జున్ ఈ సినిమాను జూన్ 23న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుందంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కాగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో ఒక పార్శ్వాన్ని ట్రైలర్ లో చూపించిన దానికి భిన్నంగా సూటు, బూటులో అల్లు అర్జున్ ఆకట్టుకుంటున్నాడు.