: ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి కదిలిన దినకరన్... నేడే అరెస్ట్!
శశికళ వర్గానికి రెండాకుల గుర్తును సంపాదించి పెట్టేందుకు ఎన్నికల కమిషన్ కు రూ. 60 కోట్ల వరకూ లంచం ఇచ్చేందుకు సిద్ధమై, మధ్యవర్తికి బయానా కూడా ఇచ్చిన ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఆదేశాల మేరకు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఈ ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి దినకరన్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. తనకు కొంత సమయం కావాలని దినకరన్ కోరగా, పోలీసులు అందుకు అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇక ఈ కేసులో నేటి విచారణ అనంతరం దినకరన్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.