: రూ. 20 కోట్ల మోసం కేసులో దీపా రాజకుమార్ పై కేసు నమోదు
20 కోట్ల రూపాయల మేరకు ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రాజకుమార్ పై చెన్నై పరిధిలోని మాంబళంలో పోలీసు కేసు నమోదైంది. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరిట రాజకీయ పార్టీని ఆమె స్థాపించగా, నెసపాక్కంకు చెందిన పార్టీ ప్రతినిధి జానకిరామన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీపను నమ్మి తాను పార్టీలో చేరానని, తనలాంటి వారిని ఆమె మోసం చేశారని ఫిర్యాదు చేశారు.
సభ్యత్వం కోసం ముద్రించిన రెండు లక్షలకు పైగా దరఖాస్తులకు డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. ఈసీ అనుమతి లేకుండా పార్టీ నిర్వాహకులను ప్రకటించి మోసం చేశారని చెబుతూ, దీపకు సహాయకులుగా ఉన్న రాజా, శరణ్యలకూ ఈ మోసంలో భాగముందని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు మాంబళం అసిస్టెంట్ కమిషనర్ సెల్వన్ కేసు నమోదు చేసుకుని విచారణను ప్రారంభించారు.