: 'పొలిటికల్ పంచ్' రవికిరణ్ విడుదల.. 25, 26న హాజరుకావాలని పోలీసుల షరతు!


సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేశారన్న ఆరోపణలపై గురువారం అరెస్టయిన పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ (35)ను తుళ్లూరు పోలీసులు ఈ ఉదయం విడుదల చేశారు. పెద్దల సభపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఆరోపణలపై రవికిరణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టింగ్‌ల వెనక ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించారు. ‘పొలిటికల్ పంచ్’కు వైసీపీకి మధ్య సంబంధం గురించి పోలీసులు ప్రశ్నించారని, అయితే ఆ పేజ్ లో పెట్టే ప్రతి పోస్ట్‌కు తనదే బాధ్యత అని చెప్పినట్టు రవికిరణ్ వివరించారు. ఈ (శనివారం) తెల్లవారుజామున పోలీసులు తనను ఇంటివద్ద వదిలిపెట్టారని చెప్పిన రవికిరణ్ ఈనెల 25, 26 తేదీల్లో మరోమారు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారని తెలిపారు.

  • Loading...

More Telugu News