: ఖండాలు దాటిన ప్రేమ... మదనపల్లె హిందువుకు...కాలిఫోర్నియాకు చెందిన ముస్లింతో వివాహం


మదనపల్లెకు చెందిన అబ్బాయి...కాలిఫోర్నియాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముంది? అనుకుంటున్నారా? ఇది ప్రత్యేకమైనదే...ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన హిందూ యువకుడు జనార్దన్ రెడ్డితో కాలిఫోర్నియాకు చెందిన ముస్లిం యువతి ఫిదా వాహిదాకు పూర్తి తెలుగు సంప్రదాయపధ్ధతిలో వివాహం జరిగింది. మతోన్మాదంతో, సాటి మనుషులను హతమార్చుకునే సమాజంలో ఖండాలు దాటి మరీ మతాంతర వివాహం చేసుకోవడం ప్రత్యేకతే!

ఈ వివాహం వివరాల్లోకి వెళ్తే...బి.కొత్తకోట మండల కేంద్రంలో అమర నారాయణస్వామి ఆలయంలో మదనపల్లెకు చెందిన నర్సిరెడ్డి, సత్తెమ్మల కుమారుడు జనార్దన్ రెడ్డి మదనపల్లెలోని ఓ ప్రైవేటు పాఠశాలను పర్యవేక్షిస్తున్నాడు. తన మేనమామ జర్మన్‌ రాజు బంధువుల అమ్మాయి ఆయిన కాలిఫోర్నియాకు చెందిన ఫిదా వాహిదాతో కొంతకాలం క్రితం అతనికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో వీరి వివాహం బి.కొత్తకోటలోని కాండ్లమడుగుక్రాస్‌ లో ఉన్న అమర నారాయణస్వామి ఆలయంలో పూర్తి తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్యలో వారి వివాహం ఘనంగా జరిగింది. 

  • Loading...

More Telugu News