: బౌలర్ వెర్సస్ బౌలర్... పరుగులు పిండుకున్న స్పిన్నర్!
ఐపీఎల్ సీజన్ అంటే క్రికెట్ అభిమానులకు పరుగుల పండగే. ఐపీఎల్ లో జరిగే టీ20 మ్యాచ్ లను బ్యాట్స్ మన్ గేమ్ అని విశ్లేషకులు పేర్కొంటుంటారు. అనూహ్యంగా ఓపెనర్ గా మారిన బ్యాట్స్ మన్ నిన్న గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో 0, 4, 0, 0, 4, 4, 4, 0, 4, 4, 4, 0, 4, 4, 6, 0 స్కోరు సాధించాడంటే ఐపీఎల్ లో బ్యాట్స్ మన్, బౌలర్ల మధ్య పోరాటం ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఊహించని విధంగా ఓపెనర్ గా మారిన వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ గుజరాత్ లయన్స్ బౌలర్లపై శివాలెత్తాడు. కొడితే ఫోర్ లేదంటే సిక్సర్ అన్నట్టు అతని ఆట సాగడం విశేషం. కేవలం 16 బంతులు ఆడిన సునీల్ నరైన్ 42 పరుగులు చేయడం విశేషం. ఇంత ధాటిగా ఆడినప్పటికీ కోల్ కతా జట్టు ఓటమిపాలు కావడం విశేషం.