: దక్షిణాదిని అవమానించిన తరుణ్ విజయ్ ని ఎలా ఆహ్వానించారు?: పుదుచ్చేరి సీఎం అసహనం


దక్షిణాది వారు నల్లగా ఉంటారు, అయినా మేము వారితో కలిసి ఉండడం లేదా? అంటూ వ్యాఖ్యానించిన బీజేపీ నేత తరుణ్ విజయ్ ని ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానించడంపై పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. వివాదాల్లో ఉన్నవారిని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఆహ్వానించకపోవడమే మంచిదని ఆయన చెప్పారు. పుదుచ్చేరిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తరుణ్ విజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన వెనక్కి వెళ్లిపోవాలని పలువురు విద్యార్థులు గొడవ చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని, బయటకు లాగేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసులు నమోదు చేశారు. దీనిపై నారాయణ స్వామి మండిపడ్డారు. దేశంలో ప్రజలంతా ఐకమత్యంతో జీవిస్తున్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేలా తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలు సరికావని హితవు పలికారు. తరుణ్‌ విజయ్‌ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News