: రాజస్థాన్, యూపీల్లో కశ్మీరీ యువకులపై దాడులు


కశ్మీర్ లో ఈ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో విధులు నిర్వర్తించి, బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న ఆర్మీ జవానుపై కశ్మీరీ యువకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతోంది. దీంతో కశ్మీరీలపై గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఉగ్రవాదులపై ఉండే వ్యతిరేకత, ఇప్పుడు వారికి సహకరిస్తున్న కశ్మీరీ యువతపైకి మళ్లింది. దీంతో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో కశ్మీరీ యువకులపై దాడులు చోటుచేసుకుంటున్నాయి. కశ్మీరీ విద్యార్థులపై రాజస్థాన్ లో స్థానికులు దాడి చేయగా, యూపీని వదిలి వెళ్లాలంటూ బ్యానర్లు వెలిశాయి. దీంతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. కశ్మీరీలు కూడా భరతమాత బిడ్డలేనని పేర్కొన్నారు. ఇలాంటి దాడులపై అలసత్వం మంచిది కాదని, కేసులు నమోదుచేసి శిక్షించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రి ఆదేశించారు. 

  • Loading...

More Telugu News