: ఇదో వింత: 'రెండేళ్ల బాలుడు' లైగింకంగా వేధించి, బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడంటూ 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు!
బిహార్ లోని చంపారన్ జిల్లా పతాహి పోలీసు స్టేషన్ లో ఒక వింత ఫిర్యాదు నమోదైంది. బేలా బైజూ గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ గత నెల 15న కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల బాలుడు తనను లైంగికంగా వేధించి, తన బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడని 35 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండేళ్ల బాలుడు లైంగిక వేధింపులకు దిగాడన్న దానిపై అంతా విస్తుపోతున్నారు.