: రికార్డులకెక్కిన ఐపీఎల్.. 600 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న ప్రీమియర్ లీగ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త మైలురాయిని చేరుకుంది. పదేళ్ల ప్రస్థానంలో 600 మ్యాచ్‌లు నిర్వహించి రికార్డు సృష్టించింది. గురువారం రాత్రి ఇండోర్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌తో 600 మ్యాచ్‌ల మార్క్‌కు చేరుకుంది. టాస్ వేయకుండా రద్దయిన ఆరు మ్యాచ్‌లను ఇందులో కలపలేదు. ఈ దశాబ్ద కాలంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అత్యధికంగా 146 మ్యాచ్‌లు ఆడిన జట్లుగా రికార్డు సృష్టించగా వ్యక్తిగతంగా గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత సాధించాడు. రైనా ఈ పదేళ్లలో 152 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 146 మ్యాచ్‌లు ఆడి ఒకే జట్టు కోసం అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు.