: తూలి పడబోయిన కేసీఆర్...పట్టుకున్న మంత్రులు


హైదరాబాదులోని కొంపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవంగా 8వ సారి ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అనంతరం దీనిపై ఎంపీ కేకే ప్రకటన చేశారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు. ఆ తరువాత అమరవీరులకు నివాళులర్పించి, వేదికపైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వేదికపైకి వెళ్తుండగా ఆయన తూలిపడబోయారు. ఈ సమయంలో ఆయన కిందపడకుండా మంత్రులు ఆయనను పట్టుకుని ఊతమిచ్చారు. దీంతో ఆయన వేదికపైకి వెళ్లి పార్టీ ప్రణాళికలను కార్యకర్తలకు వివరించారు. 

  • Loading...

More Telugu News