: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సుకు కేటీఆర్


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు చైనాలోని డాలియన్ లో జరిగే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాలని చైనా ప్రతినిధులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఈ సమావేశాలకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 2 వేల మంది ప్రతినిధులు హజరుకానున్నారు. ఇందులో పరిశోధకులు, పాలసీ మేకర్స్, వ్యాపారవేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎల‌క్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్, ఐటి పరిశ్రమల శాఖల నిపుణులు, మంత్రులు హాజ‌రుకానున్నారు.

  • Loading...

More Telugu News