: బాక్సర్ మహమ్మద్ అలీతో భారత్ ను పోల్చిన కేంద్ర మంత్రి
భారత్ ను ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా.. బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ పంచ్ తో ప్రత్యర్థులను మట్టికరిపించిన తరహాలో ధైర్యంగా పోరాడుతుందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఢిల్లీలో ఆయన నేడు ఓ వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఘన చరితను కొనసాగించే క్రమంలో దేశ సమగ్రతను దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నించినా, ఎదుర్కొనే సత్తా భారత్ సొంతం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాక్సర్ మహమ్మద్ అలి క్రీడా జీవితంలో ఎలా వెలిగాడో.. ప్రస్తుతం దక్షిణాసియాలో భారత్ అలా ప్రకాశిస్తోందని ఖుర్షీద్ అభివర్ణించారు.