: కోఠి ఆస్పత్రిలో మరో ఘోరం... వికటించిన శస్త్రచికిత్సలు.. ఇద్దరు బాలింతలు మృతి
ఇప్పటికే ఎన్నోసార్లు తీవ్ర విమర్శలపాలయిన హైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఈ రోజు మరో ఘోరం చోటుచేసుకుంది. ఈ రోజు నలుగురు మహిళలకు వైద్యులు శస్త్రచికిత్సలు చేయగా అవి వికటించడంతో వారి పరిస్థితి విషమంగా మారింది. వెంటనే వారిని అక్కడి నుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి, విచారణకు ఆదేశించారు.