: అద్వాని పాత్ర లేదు.. రెచ్చగొట్టింది నేను.. నన్ను ఉరి తీయండి: మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు
బాబ్రీ మసీదును కూల్చిన కేసులో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎల్కే అద్వానీ పాత్ర లేదని, ఆ రోజు కరసేవకులను రెచ్చగొట్టింది తానేనని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తాను ఉరి తీయించుకునేందుకు సిద్ధమని అన్నారు. ఆ రోజు మసీదు కూల్చివేత జరుగుతున్నప్పుడు తాను వీహెచ్పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్తో ఉన్నానని, తాను మరికొందరితో కలిసి కరసేవకులను రెచ్చగొట్టామని, మరోవైపు జోషీ, అద్వానీ, విజయ్ రాజే సింధియా మాత్రం ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను చేర్చాల్సిందేనని సుప్రీంకోర్టు సీబీఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రామ్ విలాస్ వేదాంతి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.