: రోజుకు 5 సినిమా షోలకు అనుమతివ్వాలి: దగ్గుబాటి సురేశ్
సినిమా టికెట్ ధరల విషయంలో అటు ప్రేక్షకులకు ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తాము ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అనురాధను కోరామని నిర్మాత దగ్గుబాటి సురేశ్ అన్నారు. ఈ రోజు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులు అనురాధతో సమావేశం అయి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పాల్గొన్న సురేశ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించేలా చూడాలని కోరినట్లు చెప్పారు. థియేటర్లలో రోజుకు 5 షోలకు అనుమతివ్వాలని, అందులో ఒక షో చిన్న సినిమా ఆడేలా అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలపై తాము భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ భేటీ అవుతామని మరో నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు.