: బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే పెట్రోల్!


వాహనదారుల ఇంటికే వెళ్లి పెట్రోల్‌ను అందించే దిశ‌గా తాము క‌స‌రత్తు చేస్తున్నామని, ఈ ప‌థ‌కం క‌స్ట‌మ‌ర్ల స‌మ‌యం వృథాకాకుండా కాపాడుతుంద‌ని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు త‌న ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. ఈ సమాచారం ప్రకారం పెట్రోలు బంకుల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు, న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్స్‌, ఫోన్ బుకింగ్‌ల ద్వారా వాహ‌నదారుల ఇంటివ‌ద్ద‌కే పెట్రోల్ పంపించే యోచన‌లో ప్ర‌భుత్వం ఉంది. దేశ వ్యాప్తంగా పెట్రోలు బంకుల వద్ద రోజుకు దాదాపు రూ.2,500 కోట్ల లావాదేవీలు జరుగుతాయి.






  • Loading...

More Telugu News