: సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు: డీజీపీ సాంబశివరావు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. విశాఖపట్టణంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ఏవోబీ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రంలో అనేక మందికి నిషిద్ధ మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందన్నారు. చంద్రబాబు సహా పలువురు పోలీసు అధికారులు మావోయిస్టుల టార్గెట్ లో ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీస్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామని, భద్రత విషయంలో విశాఖకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, టూరిజం పోలీస్ స్టేషన్, సైబర్ సెల్ ను మంజూరు చేసినట్టు డీజీపీ తెలిపారు.