: ఏర్పేడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి!
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఇరవై మంది మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. కాగా, వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ జగన్ తన పార్టీ కార్యకర్తలను, నాయకులను ఆదేశించారు. కాగా, పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన అనంతరం, దుకాణాలపైకి దూసుకుపోయింది. లారీ ప్రమాదంతో పాటు విద్యుత్ వైర్లు కూడా తెగిపడటంతో మొత్తం ఇరవై మంది చనిపోయారు.