: పొగడ్తలు వద్దు..పనులు చేయండి: నాయకులకు చంద్రబాబు చురకలు
పొగడ్తలు ఆపి, పని మీద దృష్టి పెట్టాలంటూ తమ పార్టీ నాయకులకు టీడీపీ అధినేత చంద్రబాబు చురకలు అంటించారు. అమరావతిలో ఈ రోజు టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న పార్టీ నాయకులు కొందరు మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించాక అధికారుల్లో మరింత చలనం వచ్చిందని అన్నారు. దీంతో, చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ భేటీలో లోకేశ్ కూడా పాల్గొనడం గమనార్హం. గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని, సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్ చార్జ్ మంత్రులు చొరవ తీసుకోవాలని లోకేశ్ సూచించారు.