: ఎంపీ జేసీ వాడేది రాక్షస భాష: భూమన మండిపాటు
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్న తీవ్ర పదజాలంతో ఆయన్ని విమర్శించడం విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ, జగన్ పై జేసీ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, జేసీ వాడేది రాక్షస భాష అని, ఆయన మాటలు విని ప్రజలు తలదించుకుంటున్నారని విమర్శించారు. రాయలసీమ భాషను అవమానించేలా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూస్తున్న జేసీ, జగన్ ని విమర్శించడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని అన్నారు.