: బ్రాడ్ పిట్ కు షాక్...నాలుగో పెళ్లికి సిద్ధపడ్డ ఏంజెలినా జోలీ


హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కు స్టార్ హీరోయిన్ ఎంజెలినా జోలీ షాకిచ్చింది. బ్రాడ్ పిట్ తో విడాకుల అనంతరం డిప్రెషన్ లో కూరుకుపోయిన జోలీ, పలు వ్యసనాలకు బానిసైందని, మునుపటి ఛార్మ్ కోల్పోయిందని పేర్కొంటూ పలు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మేగజీన్ ఒకటి ఎంజెలినా జోలీ మళ్లీ ప్రేమలో పడిందని తెలిపింది. కొత్త ప్రియుడు ఇంగ్లండ్ కు చెందిన వ్యాపారవేత్త అని వెల్లడించింది. ఎంజెలినా జోలీకి చెందిన మలిబు ఎస్టేట్ లో వీరిద్దరూ తరచు కలుసుకుంటున్నారని ఆ మేగజీన్ తెలిపింది. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలో జోలీ తనపిల్లలకు ఆ వ్యాపారవేత్తను పరిచయం చేయనుందని పేర్కొంది.

ఇది తెలిసిన బ్రాడ్ పిట్ షాక్ తిన్నాడని, జోలీ నాలుగో వివాహం చేసుకుంటున్న విషయం తనకు కనీసం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడని తెలుస్తోంది. తన పిల్లలు వేరే వ్యక్తితో ఉంటారన్న ఊహే భరింపశక్యంగా లేదని సన్నిహితుల వద్ద వాపోయినట్టు ఆ కథనం వెల్లడించింది. ఆ వ్యాపారిని తాను కలవనని, ఆ వ్యక్తి తన కుటుంబాన్ని విడదీస్తున్న వ్యక్తి అని బ్రాడ్ పిట్ వారిదగ్గర పేర్కొన్నట్టు సమాచారం. జోలీ 1996లో జానీ లీ మిల్లర్ ను వివాహం చేసుకుని 2000లో విడాకులు తీసుకుంది. ఆ తరువాత బిల్లీ బాబ్ థ్రాంటన్ ను 2000లో వివాహం చేసుకుని 2003లో విడాకులు తీసుకుంది. చివరగా బ్రాడ్ పిట్ ను 2014లో వివాహం చేసుకుని 2016లో విడాకులు తీసుకుంది. ఇప్పుడు నాలుగో వివాహానికి సిద్ధపడుతోంది. 

  • Loading...

More Telugu News