: 'పొలిటికల్ పంచ్’ రవికిరణ్ ను గుంటూరుకు తరలిస్తున్నాం: ఎస్పీ నారాయణ్ నాయక్
ఫేస్ బుక్ పేజీ ‘పొలిటికల్ పంచ్’ అడ్మిన్ రవికిరణ్ ను అరెస్టు చేసినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసత్య ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ యజమాని రవి కిరణ్ ని హైదరాబాద్ లో అరెస్టు చేసినట్టు చెప్పారు. అక్కడి నుంచి తీసుకువస్తున్నామని, విచారణ అనంతరం చర్యలు చేపడతామని చెప్పారు. పలు సెక్షన్ల కింద రవి కిరణ్ పై కేసులు నమోదు చేశామన్నారు.