: వద్దని చెప్పినా ఆధార్ ను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారు?: కేంద్రంపై సుప్రీంకోర్టు సీరియస్


ప్రభుత్వ పథకాలకు ఆధార్ ను తప్పని సరి చేయొద్దంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తూట్లు పొడుస్తూ పాన్ కార్డుకు ఆధార్ ను ఎందుకు తప్పనిసరి చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పాన్ కార్డు పొందడానికి ఆధార్ కార్డును ఎలా తప్పనిసరి చేస్తున్నారంటూ ప్రశ్నించింది. తాము ఆధార్ ను ఆప్షనల్ గా చేయాలని ఆర్డర్ ఇచ్చినప్పుడు, తప్పనిసరి అని ఎలా ఆదేశిస్తారంటూ కేంద్రంపై మండిపడింది. షెల్ కంపెనీలకు ఫండ్స్ తరలించి వాడుతున్న చాలా పాన్ కార్డులను తాము గుర్తించామని, ఈ ఫండ్స్ అక్రమ తరలింపును నిరోధించడానికే ఆధార్ ను తప్పనిసరి చేయాలన్న ఆప్షన్ ను పెట్టామని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్గతీ సుప్రీంకోర్టుకు తెలిపారు.

గత నెల సవరించిన ఆర్థికబిల్లులో బ్యాంకు అకౌంట్లకు, పాన్ కార్డుకు, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కు ఆధార్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. పాన్ కార్డుకు ఆధార్ తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.  

  • Loading...

More Telugu News