: సీఎం పళనిస్వామే... పన్నీర్ షరతులకు ఓకే!


తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగాలని, పార్టీ బాధ్యతలు పన్నీర్ సెల్వానికి అప్పగించాలన్న ప్రతిపాదనలకు రెండు వర్గాలూ అంగీకరించడంతో తమిళనాడులో నెలకొన్న అన్నాడీఎంకే సంక్షోభానికి తెరపడినట్లు అయింది. ఇక శశికళ కుటుంబాన్ని మొత్తం దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం చేసిన డిమాండ్ కు అంగీకరించిన పళనిస్వామి, అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పన్నీర్ సెల్వంను పార్టీ జాతీయ కార్యదర్శిగా ప్రకటించేందుకూ పళనిస్వామి పెద్దగా అభ్యంతరం పెట్టలేదని సమాచారం.

అమ్మ మృతిపై సీబీఐ విచారణ అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి పక్కన పెడదామని, కేసు విచారణ కోర్టులో ఉన్నందున, కోర్టు నిర్ణయం తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని పళనిస్వామి వర్గం నుంచి వచ్చిన ప్రతిపాదనకు పన్నీర్ సెల్వమ్ అంగీకరించడంతో, రెండు వర్గాల మధ్యా నెలకొన్న అన్ని విభేదాలు తొలగిపోయాయి. ఇక మరికాసేపట్లో మీడియా సమావేశం జరుగుతుందని ఇరు వర్గం నేతలూ వెల్లడించారు.

  • Loading...

More Telugu News