: తమిళనాట అన్నాడీఎంకే విలీన చర్చలు కొలిక్కి... కలసి మీడియా ముందుకు రానున్న పళని, పన్నీర్


గడచిన రెండు మూడు రోజులుగా, అన్నాడీఎంకేలోని రెండు వర్గాల మధ్యా సాగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ ఉదయం ఇరు వర్గాల నేతల మధ్యా జరిగిన చర్చలు ఫలప్రదమై, ఒప్పందం కుదిరిందని పార్టీ ప్రతినిధి ఒకరు చెన్నైలో తెలిపారు. మరికాసేపట్లో మీడియా ఎదుట పళనిస్వామి, పన్నీర్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతారని అన్నారు. ఈ సమావేశంలో మిగతా అన్ని విషయాలూ తెలుస్తాయని అన్నారు. నిన్నటి వరకూ జయలలిత మృతిపై సీబీఐ విచారణకు పట్టుబట్టిన పన్నీర్ వర్గం, ఆ విషయంలో కొంత పట్టువిడుపులను ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News