: రెండు పంటలకు నాలుగు వేల చొప్పున పెట్టుబడి ఇస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రైతులకు శుభవార్త. రెండు పంటలకు నాలుగు వేల చొప్పున పెట్టుబడి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ డబ్బుతో సాగుకు అవసరమైనవి రైతులు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ లోని కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడుతూ, 2001లో గులాబీ జెండా ఎగిరి, జై తెలంగాణ నినాదం మళ్లీ ఊపందుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తనపై విశ్వాసం ఉంచి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ నేతలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40 వేల కోట్లు కేటాయించామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని, ఈ ఏడాది చివరి నాటికే కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవన భృతి తదితర అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత పాలకులు కుల వృత్తులు నిర్వీర్యం చేశారని కేసీఆర్ విమర్శించారు.