: జుట్టూడిపోయింది, కనురెప్పలు, కనుబొమ్మలు కూడా పోయాయి...నాకు నేనే ఏలియన్ లా కనబడ్డాను: మనీషా కొయిరాలా


సంజయ్ దత్ బయోపిక్ లో సంజయ్ దత్ తల్లి నర్గీస్ దత్ పాత్ర పోషిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపింది. కేన్సర్ బారిన పడిన తరువాత డిప్రెషన్ లో కూరుకుపోయానని చెప్పింది. సల్మాన్ వంటి బాలీవుడ్ నటుల సహకారంతో మానసిక స్థైర్యం పుంజుకుని కేన్సర్ పై పోరాటం ప్రారంభించానని, పట్టుదలతో కేన్సర్ ను జయించానని తెలిపింది. కేన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సమయంలో తన జట్టుంతా ఊడిపోయిందని తెలిపింది.

కనుబొమ్మలు, కనురెప్పలు అన్నీ రాలిపోయాయని చెప్పింది. ఆ సమయంలో తనకు తానే ఒక ఏలియన్ లా కనిపించానని వెల్లడించింది. కీమోథెరపీ వల్ల తన శరీరం బాగా పాడైపోయిందని చెప్పిన మనీషా కొయిరాలా, నేపాల్‌ లో ఉంటూ శరీరాకృతిపై దృష్టిపెట్టానని తెలిపింది. అదే సమయంలో దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ నుంచి పిలుపు వచ్చిందని, దీంతోనే తాను సంజయ్‌ దత్‌ బయోపిక్‌ లో నర్గీస్ దత్ పాత్ర పోషించాలనగానే అంగీకరించానని తెలిపింది. 

  • Loading...

More Telugu News