: 13 ఏళ్ల బాలుడు తన బిడ్డకు తండ్రని ఫిర్యాదు చేసిన 15 ఏళ్ల బాలిక!


కేరళలోని కొల్లాం పరిధిలోని పథనపురం పోలీస్ స్టేషన్ కు ఓ విచిత్రమైన కేసు వచ్చింది. 15 ఏళ్ల 9వ తరగతి చదువుతున్న బాలిక, తన బిడ్డకు 13 ఏళ్ల పక్కింటి అబ్బాయి తండ్రని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు, బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తాను ఆ అమ్మాయితో కొన్నిసార్లు కలిసినట్టు అంగీకరించాడు. దీంతో కొల్లాం చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్, జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్ ముందు ఆ బాలుడిని ప్రవేశపెట్టగా, అతనికి బెయిల్ ను మంజూరు చేసిన న్యాయమూర్తి, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి రక్త నమూనాలు సేకరించి, డీఎన్ఏ పరీక్షలు జరపాలని ఆదేశించారు. ఇటీవలి కాలంలో కేరళలో ఈ తరహా కేసులు అధికంగా వెలుగులోకి వస్తుండటం గమనార్హం. ఇటీవల ఎర్నాకులంలో 16 ఏళ్ల బాలిక, తన బిడ్డకు 12 ఏళ్ల బాలుడు తండ్రని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News